ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా, డైరెక్టర్ కం యాక్టర్ సముద్రఖని కీలకపాత్రను పోషించిన చిత్రం "దొంగలున్నారు జాగ్రత్త". సతీష్ త్రిపుర ఈ సినిమాకు దర్శకుడు కాగా, ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటించింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ ప్రముఖ నెట్ ఫ్లిక్స్ లో రేపటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే ఈ రోజు అర్ధరాత్రి నుండే దొంగలున్నారు జాగ్రత్త సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యింది.
కాలభైరవ సంగీతం అందించిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, మంజర్ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి నిర్మించారు.