పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అదేనండి జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు లో లీడ్ హీరోగా నటిస్తున్నారు కదా... షార్ట్ బ్రేక్ తదుపరి మళ్ళీ ఈ మధ్యే వర్క్ షాప్ తో చిత్రబృందం అంతా ఏకమై, నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన అంశాలను చర్చించారు.
మరికొన్ని రోజుల్లోనే HHVM న్యూ షెడ్యూల్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో పవర్ స్టార్ MMA ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తుంది.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై AM రత్నం నిర్మిస్తున్నారు.