ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న సినిమా "హనుమాన్". ఈ మూవీ టీజర్ కు పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి తెలుగులో కన్నా ఉత్తరాదిన హనుమాన్ టీజర్ కి విశేష స్పందన దక్కింది.
హనుమాన్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాలో కీలకమైన అండర్ వాటర్ ఎపిసోడ్స్ ను తేజ సజ్జా అండ్ టీం పై చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు కొన్ని వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినోద్ రాయ్ కీరోల్స్ లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa