కోలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్ డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన చిత్రం "లవ్ టుడే". అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఘనవిజయం సాధించింది. అతి త్వరలోనే హిందీలో రీమేక్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం గురించి పక్కన పెడితే, లవ్ టుడే తెలుగు వెర్షన్ అతి త్వరలోనే డిజిటల్ లోకి ఎంటర్ అవ్వబోతుందని తెలుస్తుంది.
ఆల్రెడీ తమిళంలో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన లవ్ టుడే ఈ ఆదివారం అంటే డిసెంబర్ 25 నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రాబోతుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రాబోతుందంట.
ప్రదీప్ రంగనాధన్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa