కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "తునివు". ఈ సినిమాకు హెచ్ వినోద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. మంజు వారియర్, సముద్రఖని కీరోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా పొంగల్ 2023 కానుకగా థియేటర్లలో విడుదల కాబోతుంది. పోతే, తెలుగులో ఈ సినిమా "తెగింపు" టైటిల్ తో విడుదల కాబోతుంది.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి రెండు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా, రెండూ శ్రోతల మెప్పును పొందాయి. తాజాగా ఈ రోజు తునివు థర్డ్ సింగిల్ విడుదల కాబోతుందని మేకర్స్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఈ సినిమా నుండి గ్యాంగ్స్టా అనే లిరికల్ వీడియో విడుదల కాబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa