కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మండన్నా జంటగా, వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం "వారిసు". సంక్రాంతికి విడుదల కావడానికి సంసిద్ధమవుతున్న ఈ సినిమా తెలుగులో "వారసుడు" టైటిల్ తో రాబోతుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
వారిసు మూవీ తెలుగు, హిందీ భాషలలో కూడా విడుదల కాబోతుందన్న విషయం ఆల్రెడీ అందరికి తెలుసు. తాజా సమాచారం ప్రకారం, వారిసు మూవీ మలయాళ భాషలో కూడా విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు వారిసు మలయాళ వెర్షన్ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయట.
మరి, హిందీ, మలయాళ భాషల్లో వారిసు రిలీజ్ ఎప్పుడు ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.