మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన రీసెంట్ ఫిలిం "గాడ్ ఫాదర్". కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. గాడ్ ఫాదర్ హిందీలో కూడా అదే రోజు విడుదలైన విషయం తెలిసిందే. అక్కడ కూడా గాడ్ ఫాదర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. డిజిటల్ లో ఐతే, గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ సెన్సేషన్ సృష్టిస్తుంది.
చిరంజీవి నుండి రావడానికి రెడీ గా ఉన్న చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాను అదే రోజు హిందీ భాషలో కూడా విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మేరకు అతి త్వరలోనే అధికారిక క్లారిటీ రాబోతుంది. బాబీ డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటించారు.
మరి, గాడ్ ఫాదర్ తరహాలోనే వాల్తేరు వీరయ్య కూడా హిందీలో మంచి విజయం అందుకోవాలని కోరుకుందాం.