టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా "వారిసు". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. పొంగల్ 2023 కానుకగా తమిళ, తెలుగు భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ అభిమానుల్లో భారీ అంచనాలను నమోదు చేస్తుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వారిసు నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే న్యూ ఇయర్ లాంటి మంచి అకేషన్ ఉండడంతో ఫ్యాన్స్ అందరు కూడా జనవరి 1, 2023న వారిసు ట్రైలర్ విడుదల కాబోతుందని అనుకున్నారు కానీ..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వారిసు ట్రైలర్ జనవరి 1న కాదు కానీ..మొదటి వారంలో విడుదల కావడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.