బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ RRR సినిమా చూసిన తదుపరి నుండి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వీరాభిమానిగా మారిపోయింది. ఈ విషయాన్ని మీడియా సుముఖంగా ఒకసారి కాదు చాలాసార్లే జాన్వీ స్వయంగా వెల్లడించింది. RRR తదుపరి జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రాలు తిరగేసినట్టు, జనతా గ్యారేజ్ సినిమా చూసినట్టు జాన్వీ తెలిపింది. అంతేకాక తనకు తెలుగులో తారక్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లతో నటించాలని కుతూహలంగా ఉందని పేర్కొంది. అలానే తెలుగు డైరెక్టర్లలో కొరటాల శివ, సుకుమార్ వంటి దిగ్గజాలతో పని చెయ్యాలని ఉందట ఈ అమ్మడికి.
చూస్తుంటే... మరి, ఎన్టీఆర్ 30 లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం ఖాయమేమోననే అనిపిస్తుంది. చూద్దాం...!!