పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ "ఖుషి" ఈ నెల 31వ తేదీన మరొకసారి థియేటర్లకు రాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మేకర్స్ వీలైనంత ఎక్కువ థియేటర్లలో ఖుషి ని విడుదల చేసి, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ న్యూ ఇయర్ ని థియేటర్లలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేలా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఖుషి సినిమా మేకర్స్ కి USA మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్లు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఖుషి సినిమాను రీ రిలీజ్ చెయ్యమని కొంతమంది ధియేటర్ యజమానులు భీష్మించుకుని కూర్చున్నారు. ఐతే, ఇక్కడ పర్టిక్యులర్ గా ఖుషి సినిమా అని కాదు గానీ, రీ రిలీజ్ సినిమాలను తమ థియేటర్లలో ప్రదర్శించబోమని, తమకు గత చిత్రాల రీ రిలీజ్ సమయంలో ఎదురైన అనుభవాల ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు USA థియేటర్ యజమానులు. దీంతో USA లో ఖుషి లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే ప్రదర్శితం కాబోతుంది.