మాస్ రాజా రవితేజ... ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఏ సినీపెద్దల అండదండలు లేకుండా స్వయం కృషితో, అద్భుతమైన ప్రతిభతో హీరోగా, స్టార్ హీరోగా, మాస్ మహారాజ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థానం సంపాదించిన అచ్చతెలుగు నటుడు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, రాజశేఖర్ తదితరులు తమ వారసులని సినీరంగానికి పరిచయం చేయగా, తాజాగా ఇప్పుడు రవితేజ కుమారుడు మహాదన్ హీరో ఎంట్రీ పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజకు హీరో అవకాశమిచ్చి, స్టార్ స్టేటస్ అందించిన డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్లోనే మహాదన్ కూడా హీరోగా డిబట్ ఎంట్రీ ఇస్తాడని, ఐకానిక్ ఇడియట్ 2 సీక్వెల్ తో మహాదన్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడని ప్రచారం జరుగుతుండగా, ఈ వార్తలను రవితేజ కేవలం పుకార్లని కొట్టి పారేసారు. నిన్న జరిగిన వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో తనయుడి సినీరంగ ప్రవేశం పై రవితేజను విలేఖరులు అడగ్గా.. ఇప్పుడప్పుడే అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పేసారు.