టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ మేజర్ సినిమాతో ఆపై హిట్ 2 మూవీతో ఈ యేడాదిని కెరీర్లోనే బిగ్ మైల్ స్టోన్ ఇయర్ గా మార్చుకున్నారు. మేజర్ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఘనవిజయం సాధించడంతో శేష్ కు ఉత్తరాదిన భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఆయన రీసెంట్ హిట్ 'హిట్2' ని అతి త్వరలోనే హిందీలో రిలీజ్ చెయ్యనున్నారు మేకర్స్.
ప్రస్తుతం శేష్ తన బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శేష్ ఒక కమర్షియల్ యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఈ ప్రమోషనల్ యాడ్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయ్యి, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఐతే, ఇక్కడ విషయమేంటంటే, శేష్ యొక్క క్రేజ్ కారణంగా ఒక్క యాడ్ చేసినందుకుగానూ మేకర్స్ ఆయనకు అరకోటి పారితోషికంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీంతో నెక్స్ట్ సినిమాలకు కూడా శేష్ రెమ్యునరేషన్ పెంచే ఉంటాడని కొంతమంది అంటున్నారు.