పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటసింహం నందమూరి బాలకృష్ణగారితో చేసిన క్రేజీ చిట్ చాట్ మరొక రెండ్రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆహా సంస్థ ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించిన అసలు ట్విస్ట్ ను రివీల్ చేసింది. అదేంటంటే, అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ పాల్గొన్న ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 డిసెంబర్ 30న, బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ కాబోతున్నట్టు కొంతసేపటి క్రితమే ఆహా సంస్థ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది. బాహుబలి ఎపిసోడ్ కంక్లూజన్ ఎపిసోడ్ లో హీరో గోపీచంద్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆహా సంస్థ రివీల్ చేసిన ఈ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కి డార్లింగ్ అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa