ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', మహేశ్ బాబు 'స్పైడర్' సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను 2017 లో అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాల నైజాం రైట్స్ కొనుగోలు చేశాను. నా కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకునే వారు లేదా ఇండస్ట్రీ వదిలి పారిపోయేవారు. కానీ అదే ఏడాదిలో నిర్మాతగా 6 హిట్స్ కొట్టడంతో నిలబడగలిగాను" అని పేర్కొన్నారు.