అడివి శేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ్ల, సుప్రియ ముఖ్యపాత్రలు పోషించిన సినిమా "గూఢచారి". కొత్త దర్శకుడు శశి కిరణ్ తిక్కా డైరెక్షన్లో యాక్షన్ స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా 2018లో విడుదలై సూపర్ హిట్టయ్యింది.
తాజాగా ఈ రోజు కొంతసేపటి క్రితమే గూఢచారి సీక్వెల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. గూఢచారి సీక్వెల్ ను "G2" టైటిల్ తో ఎనౌన్స్ చేసారు. ఈ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ ని ఒక ప్రీ విజన్ వీడియోతో జనవరి 9న ఢిల్లీ, ముంబైలలో జరగబోయే గ్రాండ్ లాంచ్ ఈవెంట్లలో అధికారికంగా ఎనౌన్స్ చెయ్యనున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను గూఢచారి కి అసోసియేట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్ట్ చెయ్యనున్నారు.