టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటిస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా నుండి 'వాసవ సుహాస' అనే డివోషనల్ సాంగ్ రీసెంట్గానే విడుదలై ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. చైతన్ భరద్వాజ్ కట్టిన మధురమైన బాణీకి, కారుణ్య గాత్రం, కళ్యాణ్ చక్రవర్తి అద్భుతమైన సాహిత్యం తోడవ్వడంతో.. ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకర్షిస్తుంది.
తాజాగా వాసవ సుహాస పాటపై ప్రముఖ గీతరచయిత చంద్రబోస్ గారు ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసారు. ఈ మధ్య విన్న పాటల్లో అరుదైన, విలువైన పాట ఇదని, వినగానే ఆశ్చర్యానందానికి లోనైనట్టు పేర్కొన్నారు. అలానే ఇలాంటి గీతం రాయడానికి ఎంతో ప్రతిభ ఉండాలని, కవి కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలను చంద్రబోస్ తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa