నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న న్యూ మూవీ "హంట్". మలయాళ రైటర్స్ నుండి హంట్ మేకర్స్ ఈ మూవీ స్క్రిప్ట్ ను కొనుగోలు చేసి, సినిమాగా రూపొందిస్తున్నారు. మహేష్ ఈ సినిమాకు దర్శకుడు. రీసెంట్గా విడుదలైన టీజర్ ఇంటెన్స్ యాక్షన్ సీన్లతో ఆడియన్స్ లో క్యూరియాసిటీ రేకెత్తించింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలోనే హంట్ మేకర్స్ నుండి థియేట్రికల్ రిలీజ్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు ఆడియన్స్ ను హంట్ రిలీజ్ డేట్ ను గెస్ చెయ్యమని, విన్ ఐతే మూవీ టికెట్స్ ఉచితంగా పొందొచ్చని పేర్కొంటూ మేకర్స్ సరికొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు.
చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ నివాస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa