డార్లింగ్ ప్రభాస్ ఫన్నీ అవతార్ చూసి చాలా రోజులయ్యింది. దీంతో వింటేజ్ ప్రభాస్ ని అభిమానులు తెగ మిస్ అవుతున్నారు. డార్లింగ్ అభిమానుల కోరికను ఆహా సంస్థ అక్షరాలా నిజం చేసింది. పాన్ ఇండియా స్టార్ ని ఆ ట్యాగ్ మరిచిపోయేలా చేసి ఎంతో ఆనందంగా, హార్ట్ ఫుల్ గా, మనసు విప్పి మాట్లాడేలా చేసారు బాలకృష్ణ గారు. ఈ మేరకు విడుదల చేసిన బాహుబలి ఎపిసోడ్ ప్రోమోలను చూస్తుంటేనే ఈ ఎపిసోడ్ లో ఎంత ఫన్ కంటెంట్ ఉందో అర్ధమవుతుంది.
కొంతసేపటి క్రితమే బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ఆహా లో స్ట్రీమింగ్ కి రాగా, డార్లింగ్ అభిమానుల తాకిడి తట్టుకోలేక ఆహా యాప్ డౌన్ అయిపోయింది. దీంతో యాజమాన్యం డార్లింగ్ అభిమానులకు సారీ చెప్తూ...మరికాసేపట్లో ప్రాబ్లమ్స్ ను ఫిక్స్ చేసి యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa