ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ‌రుణ్‌కి జోడీగా శ్రద్ధాకపూర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 10, 2019, 03:30 PM

రెమో డిసౌజా దర్శక‌త్వంలో డ్యాన్స్ నేప‌థ్యంలో ఏబీసీడీ సిరీస్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రం ఏబీసీడీ3. ఈ చిత్రంలో హీరో  వరుణ్‌  ధావన్‌. ఈ చిత్రంలో వ‌రుణ్‌కి జోడీగా శ్రద్ధాకపూర్ న‌టిస్తుంది. ఈ విషయాన్ని వరుణ్‌ధావన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. ‘చిర్కుట్‌కు స్వాగతం’ అంటూ ట్వీటాడు. శ్రద్ధను వరుణ్‌ ముద్దుగా పిలుచుకునే పేరు చిర్కుట్‌. ఈ ఇద్దరూ కలసి ‘ఏబీసీడీ 2’లోనూ నటించారు. లండన్‌లో పెరిగిన ఓ పంజాబీ కుర్రాడి పాత్రలో వరుణ్‌ కనిపించనున్నాడు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa