నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిజిటల్ టాక్ షో 'అన్స్టాపబుల్ విత్ NBK సీజన్ 2' లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఎపిసోడ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన డార్లింగ్ ఫ్యాన్స్... ఎపిసోడ్ చూసిన తదుపరి డార్లింగ్ ప్రభాస్ న్యూ యాంగిల్ కి 'ఆహా' అని జేజేలు కొడుతున్నారు.
ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తనకు సంబంధించిన చాలా విషయాలను బాలయ్యతో షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఇష్టమైన, తాను ఎంతగానో ఆరాధించే డైరెక్టర్ల గురించి ప్రభాస్ చెప్పడం జరిగింది. దిగ్గజ దర్శకులు బాపు గారు, మణిరత్నం గారు అంటే తనకు ఎంతో ఇష్టమని, వారి సినిమాలను అస్సలు మిస్ అవునని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa