టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం స్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర అప్ డేట్ ఇచ్చారు. మహేశ్- జక్కన్న ప్రాజెక్టును సినిమాగా కాకుండా ఫ్రాంచైజీగా తీస్తామని తెలిపారు. ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా ఉంటాయని తెలిపారు. లీడ్ రోల్స్ అలానే ఉంటాయని, కానీ కథా నేపథ్యం మారుతుందని తెలిపారు.