తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వారసుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతి తరహాలో ఉండనుంది అని లేటెస్ట్ టాక్. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 137.90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.
'వారసుడు' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::
నైజాం : 5 కోట్లు
సీడెడ్ : 2 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ : 7 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 14.00 కోట్లు
తమిళనాడు - 72 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 14 కోట్లు
కర్ణాటక - 7.20 కోట్లు
కేరళ - 6.50 కోట్లు
ROI - 3.20 కోట్లు
ఓవర్సీస్ - 35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 137.90 కోట్లు