ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగమార్తాండ : బిగ్ బాస్ సెలబ్రిటీ ఫస్ట్ లుక్ రిలీజ్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 13, 2023, 06:03 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా "రంగమార్తాండ". ఈ సినిమాకు ఇళయరాజా గారు సంగీతం అందిస్తుండగా, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ సంయుక్త బ్యానర్ లపై కాలేపు మధు, ఎస్ వెంకట్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ షాయరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.


తాజాగా ఈ సినిమా నుండి బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అలీ రెజా ఫస్ట్ లుక్ విడుదలైనది. ఈ సినిమాలో సిద్దార్థ పాత్రలో అలీ రెజా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa