బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 11.95 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ :::::
నైజాం : 4.96 కోట్లు
సీడెడ్ : 2.48 కోట్లు
UA : 1.44 కోట్లు
ఈస్ట్ : 88 L
వెస్ట్ : 36 L
గుంటూరు : 67 L
కృష్ణ : 80 L
నెల్లూరు : 36 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 11.95 కోట్లు (20.10 కోట్ల గ్రాస్)