సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రంల కలయికలో దాదాపు పుష్కరకాలం తదుపరి సినిమా రాబోతుండడంతో ఆడియన్స్ లో అంచనాలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, జనవరి 18వ తేదీ నుండి SSMB 28 షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తుంది. ముందుగా ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించగా, తాజాగా షెడ్యూల్డ్ డేట్ వాయిదా పడిందని తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. SSMB 28 సినిమాను ఆగస్టు 11న విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొన్నారు.
పోతే, ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బుట్టబొమ్మ పూజాహెగ్డే, పెళ్ళిసందడి భామ శ్రీలీల నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa