కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశీ జంటగా నటిస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రమోషనల్ టూర్ చేస్తూ, సినిమాకు తగిన బజ్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈమేరకు నిన్న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం కనుమ ఉత్సవాల్లో పాల్గొన్న కిరణ్ ఈ రోజు కాకినాడ పద్మ ప్రియా థియేటర్ ను సందర్శించి, అక్కడి ప్రేక్షకులతో ముచ్చటించారు.
చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు
![]() |
![]() |