కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, లోకేష్ చివరి చిత్రం విక్రమ్‌లో కీలక పాత్ర పోషించిన ఫహద్ ఫాసిల్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ...... ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైనందున తాను కూడా 'తలపతి 67' లో ఉండవచ్చు అని వెల్లడించారు. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa