ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలైట్ $2 బిలియన్ల క్లబ్‌లో చేరిన 'అవతార్ 2'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 06:26 PM

సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన అవతార్‌ సీక్వెల్‌ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రం అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్‌ టోటల్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ చిత్రంగా నిలిచింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అవతార్: ది వే ఆఫ్ వాటర్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన 38వ రోజు ముగిసే సమయానికి $2 బిలియన్ల క్లబ్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో సామ్ వర్తింగ్టన్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైట్‌స్టార్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు TSG ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa