మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన "వాల్తేరు వీరయ్య" సంక్రాంతి కానుకగా ధియేటర్లకొచ్చి, అశేష ప్రేక్షకాభిమానుల నీరాజనాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మెగా మాస్ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా రీసెంట్గానే 100కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్లో చిరు ఖాతాలో మూడవ 100కోట్ల షేర్ సినిమా వచ్చి చేరినట్టయ్యింది. డైరెక్టర్ బాబీ రూపొందించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో మాస్ రాజా రవితేజ క్రూషియల్ రోల్ లో నటించారు.
తాజాగా వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలెబ్రేషన్స్ ను నిర్వహించేందుకు మేకర్స్ గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఈనెల 28న వరంగల్లో వాల్తేరు వీరయ్య మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ జరగబోతున్నాయని టాక్. ఈ మేరకు త్వరలోనే మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రాబోతుందంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa