ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు తన అద్భుతమైన టేకింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. RRR తో రాజమౌళి క్రేజ్ విశ్వవ్యాప్తం అయ్యింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గా ఎదగాలనే ఎంతో మంది యువకులకు రాజమౌళి హీరోగా మారారు. తాజాగా RRR లోని నాటు నాటు పాట ఆస్కార్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు రాజమౌళి అండ్ టీంకి బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా RRR చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. రీసెంట్గానే రాజమౌళిని తన హీరో అని పేర్కొన్న సుకుమార్ తాజాగా జక్కన్నపై తన వల్లమాలిన అభిమానం చూపిస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన టీమ్ తో పాల్గొనే మీటింగ్స్, ఇంటిరాక్షన్స్ లో అనుకోకుండానే ఒక కుర్చీని ఖాళీగా వదిలివేసేవాడినని, ఐతే, ఆ కుర్చీని తాను ఎందుకు వదిలేస్తున్నానో.. ఇప్పుడే అర్థమైందని.. రాజమౌళి గారికి ఆ కుర్చీ సొంతం అని, ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా ఆ కుర్చీ జక్కన్నకే చెందుతుందని సుకుమార్ కామెంట్ చేసారు. అంటే, సుకుమార్ జక్కన్నను తన గురువులా భావిస్తున్నారన్న మాట.
![]() |
![]() |