టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ని హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'మామా మశీంద్ర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
తాజాగా ఇటీవలి జరిగిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మామా మశ్చీంద్ర సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెల్లడించాడు. ఈ సినిమాలో తను 3 విభిన్న పాత్రల్లో కనిపిస్తానని చెప్పాడు. అంతేకాకుండా ఈ ద్విభాషా చిత్రం కామెడీతో కూడిన ఇంటెన్స్ డ్రామా అని సుధీర్ తెలిపారు.
ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై ప్రొడక్షన్ నెం 5గా నారాయణ్ దాస్ కె నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజులలో మేకర్స్ వెల్లడి చేయనున్నారు.