ఈ నెల 26వ తేదీన విడుదల కావాల్సిన "బుట్టబొమ్మ" చిత్రం ఫిబ్రవరి నాల్గవ తేదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బుట్టబొమ్మ ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 28వ తేదీన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బుట్టబొమ్మ ట్రైలర్ ను లాంచ్ చేస్తారని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.