సురేంద్ర మాదారపు డైరెక్షన్లో సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రం "సువర్ణ సుందరి". ఇందులో సీనియర్ నటి జయప్రద, హీరోయిన్లు పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఎస్ టీం పిక్చర్స్ బ్యానర్ పై ఎం ఎల్ లక్ష్మి నిర్మించిన ఈ చిత్రాన్ని డా. ఎంవీకే రెడ్డి సమర్పిస్తున్నారు.
కరోనా కారణంగా పలు మార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ తాజాగా వచ్చే నెల 3వ తేదీన థియేటర్లకు రావడానికి సుముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ రోజు గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ, ఆడియన్స్ అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలియచేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.