తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ యువగళం పేరిట పాదయాత్రను ఇటీవలే ప్రారంభించారు. ఈరోజు ఈ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్న స్పృహతప్పి సొమ్మసిల్లి ఉన్నచోటనే కూలబడిపోయారు. వెంటనే ఆయనను కుప్పం ఆసుపత్రికి తరలించారు.
తాజా సమాచారం ప్రకారం, తారక రత్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారని, వైద్యులు ఆయనకు స్టంట్ వేశారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తుంది. బాలకృష్ణ గారు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారట. కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా హాస్పిటల్ కు చేరుకుంటున్నారు.