బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్న 'అన్స్టాపబుల్ విత్ NBK' సీజన్ 2 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ నెలాఖరులోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా, ఇంకా స్ట్రీమింగ్ కి రాలేదు.. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఐతే, తాజాగా పవన్ ఫ్యాన్స్ లో ఫుల్ ఖుషిని నింపుతూ, ఆహా సంస్థ సరికొత్త ప్రకటన చేసింది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చెయ్యబోతున్నట్టు కాసేపటి క్రితమే ఎనౌన్స్ చేసారు.