వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక ఎంటర్టైనర్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'విడుతలై' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రెండు భాగాలుగా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సూరి కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా కోసం మక్కల్ సెల్వన్ విజయ్ డబ్బింగ్ ప్రారంభించినట్లు సమాచారం.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి టీచర్‌గా నటిస్తుండగా, సూరి పోలీసుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జయ మోహన్ రాసిన తునైవన్ నవల నుండి తీసుకున్న చిన్న కథ నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa