హీరో శివకార్తికేయన్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రముఖ నటుడికి 38 ఏళ్లు అవుతున్నాయి మరియు అభిమానులు ఈ ప్రత్యేక సందర్భాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. శివకార్తికేయన్ రాబోయే చిత్రం 'మావీరన్' నుండి 'సీన్ ఆహ్ సీన్ ఆహ్' మొదటి సింగిల్‌ను చిత్రబృందం రిలీజ్ చేసారు. ఈ సినిమాకి భరత్ శంకర్ సంగీతం అందించారు.మరోవైపు, ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో పూర్తి చేసి జూన్‌లో థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉంది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మడోన్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ సినిమాని శాంతి టాకీస్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa