ప్రముఖ నటుడు బాబీ సింహా ఇటీవల బృందా దర్శకత్వం వహించిన కోనసీమ థగ్స్‌లో కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ స్టార్ యాక్టర్ నటించిన 'వసంత కోకిల' చిత్రం విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. నూతన దర్శకుడు రమణ పురుషోత్తం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి కథానాయికగా నటించింది.
సైకలాజికల్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా మార్చి 3, 2023న OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. రాజేష్ మురుగేశన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నటుడు ఆర్య కీలక పాత్ర పోషించారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించింది.
![]() |
![]() |