చాలా కాలం తర్వాత ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో మంచి హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ. ఆ తరువాత వచ్చిన ‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జువాల్కర్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. మార్చి 4 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. సినిమా ఆరంభంలో రవితేజ వృద్ధుడిగానూ.. అనంతరం శత్రువులపై పగ తీర్చుకోవడం కోసం సైంటిఫిక్ ప్రయోగాలతో యువకుడిగానూ మారుతాడని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa