'ది కేరళ స్టోరీ' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఫుడ్ అలర్జీ, డయేరియాతో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. తన రాబోయే వెబ్ సిరీస్ 'కమాండో' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 11న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa