కెవి గుహన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన 'హైవే' చిత్రం డైరెక్ట్ OTTలో రిలీజ్ అయ్యి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంది. తాజాగా ఇప్పుడు, సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ఈరోజు ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబటులోకి వచ్చింది.
ఈ చిత్రంలో మానసా రాధాకృష్ణన కథానాయికగా నటించగా జాన్ విజయ్, రేష్మా పసుపులేటి, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మించారు.