టాలీవుడ్‌లో హీరో నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈడీ నుంచి 41 సిఆర్ పిసి నోటీస్ అందింది. ఈ నెల 10వ తేదీన నవదీప్‌ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. 2017లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నమోదు చేసిన కేసులో నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కూడా జరిగిందన ఈడీ తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుబాటి, రవితేజ, ఛార్మి, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌లను విచారించారు. సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను విచారించగా వీళ్లతో నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఈ డ్రగ్స్ కేసులో నవదీప్‌ని నిందితుడుగా భావించిన పోలీసులు ఇటీవల అతడిని విచారించారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చినా నవదీప్ విచారణకు హాజరు కాలేదు. తాజాగా గుడిమల్కాపుర్ డ్రగ్స్ కేస్‌లో నవదీప్‌ను విచారించారు. నవదీప్‌కు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే పలువురు నైజీరియన్‌లను బెంగుళూరులో నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు.