రామ్ నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ సరసన లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు. అక్టోబర్ 27న రిలీజ్ కానున్న ఉన్నది ఒకటే జిందగీ సినిమా చూసిన సెన్సార్ బృందం.. సినిమాకు U సర్టిఫికెట్ కేటాయించింది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించినట్లు చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్, పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa