తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన బేబీ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. తాజాగా ట్రూ లవర్ ప్రమోషన్స్ సందర్భంగా నిర్మాత SKN హిందీ రీమేక్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. హిందీ వెర్షన్‌కు సాయి రాజేష్ స్వయంగా దర్శకత్వం వహిస్తారని ఎస్కెఎన్ వెల్లడించారు.
ఎస్కేఎన్ మాట్లాడుతూ.. బాలీవుడ్ రీమేక్ కోసం 'కల్ట్ బొమ్మ' అనే టైటిల్ రిజిస్టర్ చేశాం. సాయి రాజేష్ దర్శకత్వం వహించనున్న హిందీ వెర్షన్ కోసం స్టార్ నటుల్ని లేదా కొత్తవారిని ఎంపిక చేయడానికి మేము పరిశీలిస్తున్నాము. 'అర్జున్ రెడ్డి' హిందీలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే బేబీ బాలీవుడ్లో కూడా విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాము అని అన్నారు.