బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం ‘డంకీ’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది డిసెంబర్ 21న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది.
షారుఖ్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ కాంబోపై ఉన్న అంచనాల కారణంగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని ఉంటాయి. కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ప్రభాస్ సలార్‌కు పోటీగా డిసెంబర్ 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఫుల్ థియేట్రికల్ రన్లో 470 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియా వైడ్‌గా ఈ మూవీ 262 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. ఓవర్సీస్లో 197 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.