దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటించనున్నారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వెలువడనుంది. మూవీ మేకర్స్ రామాయణాన్ని ట్రైలాజీగా ప్లాన్ చేసారు మరియు టీమ్ ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ ప్రారంభించింది.
ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి దాదాపు పది కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తోంది. సాధారణంగా, ఆమె తెలుగులో 3 నుండి 4 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఆస్కార్-విజేత సంగీత దర్శకులు AR రెహమాన్ మరియు హన్స్ జిమ్మర్ ఈ ప్రాజెక్ట్ కి సంగీతం అందించనున్నారు.