కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ సినీ నటుడు, నిర్మాత ద్వారకీష్ (81) మంగళవారం చనిపోయారు. నటుడిగా, నిర్మాతగా సినీ రంగానికి ఆయన సేవలు అందించారు. గత రాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఉదయం లేచినా తర్వాత కాఫీ తాగి పడుకున్నారు. ఆ తర్వాత లేవలేదు. నిద్రలోనే గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు ద్వారకీష్ కుమారుడు యోగి వెల్లడించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.