ప్రదీప్ రంగనాథన్ కోమలి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత తానే స్వయంగా దర్శకత్వం వహించిన లవ్ టుడే చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఈ చిత్రం యువకులను ఆకట్టుకుంది మరియు 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇటీవలే నటుడు-దర్శకుడు కథానాయకుడిగా తన తదుపరి ప్రాజెక్ట్ను AGS ప్రొడక్షన్ ప్రకటించి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా AGS26 అనే టైటిల్ ని లాక్ చేసారు. ఓ మై కడవులే రోమ్-కామ్ ఎంటర్టైనర్ను అందించిన అశ్వత్ మరిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క అనౌన్స్మెంట్ వీడియోని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.