ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీత ఎమోషనల్ పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 02:52 PM

సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం సుప్రీతా నర్మగర్భంగా చేసిన పోస్ట్. తన ఫోటోలు షేర్ చేస్తూ సుప్రీతా కామెంట్ పెట్టింది. నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 


కొన్ని సార్లు తమ పోస్ట్ వల్ల సురేఖ వాణి, సుప్రీత ట్రోలింగ్ ట్రోలింగ్ కి గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సురేఖ వాణి, సుప్రీత కౌంటర్ ఇవ్వడం చూశాం. తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అందుకు కారణం సుప్రీతా నర్మగర్భంగా చేసిన పోస్ట్. తన ఫోటోలు షేర్ చేస్తూ సుప్రీతా కామెంట్ పెట్టింది. నా జీవితంలోకి కొందరు వస్తుంటారు వెళుతుంటారు.. అదే లైఫ్ అంటే అంటూ కాస్త ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. కానీ ఆమె షేర్ చేసిన ఫోటోస్ మాత్రం చాలా గ్లామరస్ గా ఉన్నాయి. ఈ పోస్ట్ కి సుప్రీతా కామెంట్స్ కూడా ఆపేసింది. దీనితో సుప్రీతా ఎం చెబుతోందో అర్థం కాక నెటిజన్లు తికమక పడుతున్నారు. బహుశా సుప్రీతా ప్రేమ వ్యవహారం గురించి ఇలా పరోక్షంగా మాట్లాడుతోందా అనేది కూడా చర్చగా మారింది. ప్రస్తుతం సుప్రీతా.. బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అందుకే సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది. గతంలో సుప్రీతా మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది. ఇప్పుడు తన తల్లి అండదండలతో హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నిస్తోంది. మరి సుప్రీతా హీరోయిన్ గా సక్సెస్ అవుతుందేమో చూడాలి. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com