రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ విలేజ్ డ్రామా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మే 16, 2024న మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానెల్లో ప్రదర్శించబడుతుందని సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.